Header Banner

క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!

  Fri Feb 28, 2025 08:19        Entertainment

క్రిప్టో కరెన్సీ పేరుతో పుదుచ్చేరిలో జరిగిన రూ. 2.4 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సినీ హీరోయిన్లు తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌ను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ పెట్టి 10 మంది నుంచి రూ.2.4 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరిలోని మూలకుళం ప్రాంతానికి చెందిన మాజీ సైనికాధికారి అయిన అశోకన్ (66) పదవీ విరమణ తర్వాత బీఎస్ఎన్ఎల్‌లో పనిచేశారు. ఇంటర్నెట్‌లో ఒక ప్రకటన చూసి నమ్మిన ఆయన ఒక రహస్య వ్యక్తిని కలిసిన అనంతరం పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని, పొదుపు చేసుకున్న సొమ్ము మొత్తం రూ. 10 లక్షలను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో 2022లో కోయంబత్తూరులో జరిగిన కంపెనీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అశోకన్‌కు ఆహ్వానం అందింది.

 

ఇది కూడా చదవండి: 23 ఏళ్లలో పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డు! ఈసారి ఒక్క మ్యాచ్ కూడా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు!

 

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి తమన్నాతోపాటు మరికొందరు తారలు హాజరుకావడంతో అశోకన్ తన పెట్టుబడిని క్రమంగా కోటి రూపాయలకు పెంచారు. అంతేకాకుండా పుదుచ్చేరికి చెందిన తన స్నేహితులు మరో 10 మందితో రూ. 2.4 కోట్లు పెట్టుబడి పెట్టించారు. అనంతరం కొన్ని నెలల తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి కూడా అశోకన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 100 మందికి రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన కార్లను బహుమతులుగా అందించారు. అయితే, అశోకన్ తనకు ఇచ్చిన కారుకు బదులుగా రూ. 8 లక్షల నగదు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కంపెనీ తమను మోసం చేసిందంటూ అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భారీ మోసం కేసులో పోలీసులు ఇప్పటికే నితీశ్ జైన్ (36), అరవింద్ కుమార్ (40)లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమన్నా, కాజల్‌ను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. 

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tamannaah #KajalAgarwal #CyprotcurrencyCase #Puducherry